పెద్దపల్లి: యువ వికాసం అమలుకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

యువ వికాసం అమలుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసంపై అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 14 వరకు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద ఆఫ్ లైన్, ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ చేయాలని, లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్