ముత్తారం: అకాల వర్షం.. అపార నష్టం

ముత్తారం మండలంలో అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టం మిగిల్చింది. వడగండ్ల వాన, ఈదురు గాలులతో కూడిన వర్షానికి వరి, మొక్కజొన్న, మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోయారు. మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న పంట నేలవాలగా, మామిడి కాయలు నేలరాలి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్