హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించనున్న విరసం సభ కరపత్రాలను పెద్దపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద శనివారం ప్రజా సంఘాల నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విప్లవ రచయితల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్వీనర్ బాలసాని రాజయ్య మాట్లాడుతూ విరసం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5. 30గంటల వరకు సభ జరుగుతుందని పేర్కొన్నారు.