పెద్దపల్లిలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ కోరారు. గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బాలికల కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కల్పనకి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం రూ 2కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ బాలికల కళాశాలకు నూతన భవనాన్ని నిర్మించలేదన్నారు. ఇప్పటికైనా కళాశాల నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు.