పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు పెద్దపల్లి రూరల్ మండల అధ్యక్షులు వేల్పుల రమేష్ ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. ప్రాణుల మనుగడకు ప్రకృతే ఆధారమని, ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్లాస్టిక్ భూతాన్ని, కాలుష్య రక్కసిని తరిమి వేయాలన్నారు. వన మహోత్సవం నిర్వహిస్తూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.