తెలంగాణలోని కమాన్‌పూర్ మండలం పేరపల్లి గ్రామంలో చెప్పాల దేవేందర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన దేవేందర్, బుధవారం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి పక్కన పత్తి చేనులో మృతదేహంగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.