పెద్దపల్లి: పూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మహాత్మా జ్యోతిభా పూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి జ్యోతిభా పూలే జయంతి వేడుకల్లో పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే ప్రజలకు అందించిన సామాజిక సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్