పెద్దపల్లి: రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డు వద్ద రాజీవ్ రహదారిపై బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మల్యాల రాజేశం (59) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం. పెద్ధపల్లికి చెందిన మల్యాల రాజేశం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పట్టణంలోని కూనారం క్రాస్ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేశం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్