పెద్దపల్లి: వింత జీవిని ప్రసవించిన గొర్రె

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావు పల్లె గ్రామంలో ఎల్పుల రాజయ్యకు చెందిన గొర్రె శుక్రవారం ఒక వింత జీవిని ప్రసవించింది. కండ్లు నోరు లేకుండా ఒక చిన్న రంద్రం ద్వారా బయటికి వచ్చిన నాలికతో గొర్రె పిల్ల జన్మించడంలో
గ్రామస్తులు వింతగా చూశారు. కాగా జన్మించిన కొద్దిసేపటికే గొర్రె పిల్ల మృతి చెందిందని రాజయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్