పెద్దపల్లి: ప్రతి నిరుపేదకు ఇల్లు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యమని పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణరావు అన్నారు. బుధవారం పెద్దపల్లి మండలం చీకురాయి, బోజన్నపేట, హన్మంతుపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పట్టాలను అందజేశారు. అనంతరం ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్