గోదావరిఖని డిపో టీఎస్ఆర్టీసీ ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేసింది. మే 7న ప్రారంభమై మే 14న ముగిసే ఈ యాత్రలో అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి, మధురై, శ్రీరంగం, పళని, కంచి వంటి 10 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఒక్కొక్కరికి టికెట్ ధర ₹10,500. మరిన్ని వివరాలకు 7382847596, 7913504982 నంబర్లను సంప్రదించవచ్చు.