సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గోదావరిఖనికి చెందిన బాణేష్ (28), లింగం (48) మృతి చెందారు. మహేశ్ (44) పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు హైదరాబాద్‌కు తరలించారు. కారు డ్రైవర్ కుందేళ్ల ప్రణయ్ సాగర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.