సికింద్రాబాద్- కాగజ్ నగర్ రైలు మార్గంలో ప్రతిరోజు నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ (17233, 17234) ను ఈనెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లితోపాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు నిత్యం ఈ రైలు ద్వారా ప్రయాణం సాగిస్తుంటారు. భాగ్యనగర్ రైలు రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.