రామగుండం: 7 రోజుల ముందుగానే ఉత్పత్తి లక్ష్యం చేరుకున్న ఆర్జీ-3

రామగుండం ఏరియా- 3లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏడు రోజుల ముందుగానే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించినట్లు జనరల్ మేనేజర్ సుధాకరరావు తెలిపారు. సంస్థ నిర్దేశించిన 62. 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను 100 శాతంతో 62. 5003 లక్షల టన్నుల బొగ్గును 7రోజుల ముందుగానే ఉత్పత్తి చేసినందుకు అధికారులు, ఉద్యోగులను అభినందించారు. భవిష్యత్తులోనూ సమిష్టి కృషితో సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

సంబంధిత పోస్ట్