వేములవాడ మండలం సంకెపల్లి గ్రామానికి చెందిన పోచెంపల్లి అనిల్ (35) అనే కూలీ, వ్యక్తిగత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వేములవాడకు వెళ్లి వస్తుండగా, నాంపల్లి ఘాట్ రోడ్డు సమీపంలో కుక్క అడ్డు రావడంతో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన అనిల్, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.