సిరిసిల్ల: వాగులో పడి యువకుడి మృతి

వాగులో పడి యువకుడు మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. దోమకొండ మండలానికి చెందిన నీరెడ్డి వినయ్ అనే యువకుడు హనుమాన్ మాల దీక్ష తీసుకున్నాడు. బుధవారం రాత్రి మల్లారెడ్డిపేటలోని హనుమాన్ దేవాలయం వద్దకు వచ్చాడు. ఆలయం ఆవరణలో ఉన్న వాగులో దిగిన వినయ్‌కి ఈత రాకపోవడంతో నీటిలో మునిగి ప్రాణాలు విడిచాడు.

సంబంధిత పోస్ట్