ఏటా వేసవి కాలంలో ప్రకృతి ప్రియులను ఆకట్టుకునే 'మే' పుష్పం ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే వికసించింది. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన చంటి స్టాండ్లిన్ తన ఇంటి ఆవరణలో నాటిన మొక్కకు ఈ పువ్వులు పూశాయి. ప్రకృతిని ఆస్వాదించేవారు మే నెల రాగానే వీటి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మొక్క యజమాని ఒకేసారి 8 పుష్పాలు వికసించడం సంతోషంగా ఉందని తెలిపారు.