గత 24 గంటలలో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో వివిధ రకాల 19 ఆపరేషన్లు జరిగాయి. ఇందులో 11 మంది గర్భిణీలు డెలివరీలు అయ్యారు. ఇందులో ఆరుగురు ఆపరేషన్లు ఐదుగురు సాధారణ కాన్పులు జరగడం అయింది. ఇద్దరికీ గర్భసంచికి సంబంధించిన వ్యాధుల వల్ల గర్భసంచినీ తొలగించడం జరిగింది. ముగ్గురికి కంటి ఆపరేషన్లు, ఇంకో నలుగురికి జనరల్ సర్జరీలు చేయడం జరిగిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ బుధవారం తెలిపారు.