వైభవంగా శ్రీ బద్ది పోచమ్మకు బోనాలు

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారి సన్నిధి భక్తుల జయజయధ్వానాలు, ఆధ్యాత్మిక కోలాహలంతో మార్మోగింది. సోమవారం స్వామివారిని దర్శించుకున్న భక్తులు, మంగళవారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. తమ ఇలవేల్పు అయిన బద్ది పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సాంప్రదాయబద్ధంగా తలపై బోనాలతో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్