తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 'ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్' అవగాహన కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల నుంచి రక్షించుకోవడానికి అవగాహన, డిజిటల్ జాగ్రత్తలు పెంచాలని, అనుమానాస్పద లింకులు, OTPలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంచుకోకూడదని ఎస్ఐ జునైద్ సూచించారు. ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, నేర్చుకున్న విషయాలను ఇతరులకు తెలియజేయాలని, ఉపాధ్యాయులు కూడా సైబర్ నేరాల నియంత్రణలో పాత్ర పోషించాలని కోరారు.