ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ భగత్ సింగ్ ఆశయాల స్ఫూర్తితో విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు తమ సమస్యలపై పోరాడాలని ఎస్ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది.

సంబంధిత పోస్ట్

✕
✕