వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి గ్రామంలో VBG రాంజీ నిధులతో పశువుల పాక నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలోని పశుపోషకులకు ప్రయోజనం చేకూరేలా పశువులకు రక్షణతో పాటు సౌకర్యవంతమైన వసతి కల్పించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. గ్రామ సర్పంచ్ ముత్త సంజన మహేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు పశుపోషకుల సంక్షేమానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పశువులకు రక్షణ కల్పించడంతో పాటు రైతులకు, పశుపోషకులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ పశువుల పాక నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.