స్వచ్ఛ హరిత విద్యాలయాలకు ప్రశంసా పత్రాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వచ్ఛ హరిత విద్యాలయాలుగా ఎంపికైన 8 పాఠశాలల హెచ్ఎంలు, బాధ్యులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలోని 650 పాఠశాలలు సర్వేలో పాల్గొనగా, అత్యధిక స్కోర్ సాధించిన పాఠశాలలు ఎంపికయ్యాయి. కేటగిరి 1లో ఐదు, కేటగిరి 2లో మూడు పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్