గడపగడపకు గులాబీ జెండా కార్యక్రమంలో భాగంగా, వేములవాడ మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు BRS పార్టీ అభ్యర్థి నిమ్మశెట్టి విజయ్ కు మద్దతుగా నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన BRS విజయం సాధించిందని, 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థుల మోసాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. 12వ వార్డు ప్రజలు చల్మెడకు మద్దతు తెలుపుతూ, కారు గుర్తుపై ఓటు వేసి నిమ్మశెట్టి విజయ్ ను గెలిపిస్తామని హామీ ఇచ్చారు.