ఘనంగా ప్రారంభమైన చంద్రుర్తి ప్రీమియర్ లీగ్

శనివారం చందుర్తి ప్రీమియర్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా, సనుగుల గ్రామ సర్పంచ్ బోడిగె లావణ్య అనిల్ గౌడ్, చిరు 11 క్రికెట్ జట్టుకు క్రీడా దుస్తులు (జెర్సీలు) పంపిణీ చేశారు. గ్రామ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, క్రీడాకారులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. క్రీడల వల్ల ఆరోగ్యం, క్రమశిక్షణ, ఐక్యత పెరుగుతాయని, గ్రామీణ ప్రతిభకు ఇది మరింత ప్రోత్సాహాన్నిస్తుందని నిర్వాహకులు తెలిపారు. చిరు 11 జట్టు సభ్యులు, నిర్వాహకులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్