అధ్వానంగా మారిన చందుర్తి మోత్కురావుపేట ప్రధాన రహదారి

రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని చందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా గుంతలమయంగా మారింది. మట్టి రోడ్డు కావడంతో వర్షపు నీటితో బురదమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు తెలిపారు. అధికారులు స్పందించి వెంటనే పక్కా రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕