రాజన్న సిరిసిల్ల జిల్లాలో మార్చి 28, 2026, శనివారం నాడు SSC పబ్లిక్ పరీక్షలు నాలుగవరోజు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాలలో 7317 మంది విద్యార్థులకు గాను 7309 మంది (99.89%) హాజరయ్యారు, 8 మంది గైర్హాజరయ్యారు. జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి 3 పరీక్షా కేంద్రాలను, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 9 పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షలు సజావుగా సాగాయని జిల్లా విద్యాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.