వేములవాడ పురపాలక సంఘం కార్యాలయంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు. బడ్జెట్ సమావేశాన్ని కౌన్సిలర్లకు కనీసం వారం రోజుల ముందు సమాచారం ఇవ్వాలని సమావేశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన కౌన్సిలర్లు. గడువు ఇవ్వకుండా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించడం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందజేసిన కౌన్సిలర్లు. గడువు ఇవ్వకుండా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించిన తీరుపై జరుగుతున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోని మినిట్స్ బుక్కులో నమోదు చేయాలని కోరిన కౌన్సిలర్లు తర్వాత నమోదు చేస్తామని వెల్లడించిన కమిషనర్ సంపత్ కుమార్.