రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో బక్రీద్ పండగ సందర్భంగా ఈద్గాలో శాంతియుత వాతావరణంలో ప్రార్థనలు జరిగాయి. ప్రార్థనల అనంతరం ముస్లిం మత పెద్దలు ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్లకార్డులు పట్టుకొని డిమాండ్ చేశారు. దేశంలో ఆవుల పేరుతో జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ఈ బక్రీద్ పండగలో ఆవులను బలి ఇవ్వద్దని విజ్ఞప్తి చేశారు. జాతీయ పక్షి నెమలి వలె ఆవును కూడా జాతీయ జంతువుగా ప్రకటించాలని సిరిసిల్ల ముస్లిం కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సమీ మజీద్ కోరారు.