వేములవాడ పట్టణం ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలోని 20 మందికి చెక్కులు అందజేశారు.