ఇంటింటా ప్రచారం నిర్వహించి బీజేపీ అభ్యర్థిని ద్వారక శ్రీదేవి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బుధవారం సాయంత్రం, 11వ వార్డు బిజెపి అభ్యర్థి ద్వారక శ్రీదేవి స్థానిక మహిళలతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కేంద్ర నిధులతో వేములవాడ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలను బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామని, అవి పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు చేపడతామని ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్