వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 1 నుంచి 12 వరకు పర్యావరణ ఉత్సవాలలో భాగంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, జిల్లా అధికారులు హాజరయ్యారు.