రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

కోనరావుపేట మండలం మర్రి వద్ద అన్నదాతలు, BRS నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వడ్ల కోసం లారీలు రావడం లేదని, ఎమ్మెల్యేలకు గృహప్రవేశాలకు వెళ్లే తీరిక ఉంది కానీ కొనుగోలు కేంద్రాలకు వచ్చే తీరిక లేదా అని ప్రశ్నించారు. రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ధాన్యం సేకరణ వేగంగా జరిగేదని, ప్రస్తుత పాలనలో జాప్యం వెనుక మతలబు ఏంటని డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వడ్ల కుప్పలు తడిసి రైతులు ఆగమవుతారని ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే లారీలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్