రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి: కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుపై ఏపీఎంలు, ఐకేపీ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, బుక్ కీపర్లకు శిక్షణ ఇచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. గ్రేడ్ ఏ రకం వరి ధాన్యం క్వింటాలుకు రూ. 2,389, కామన్ రకానికి క్వింటాలుకు రూ. 2,369 గా ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ సీజన్లో జిల్లాలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగింది.

సంబంధిత పోస్ట్