కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం దేవుని తండా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ లకావత్ చాత్రులా, గుగులోత్ రమేష్, రూప్ సింగ్, నరేష్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి కాంగ్రెస్ లో చేరినట్లు వారు తెలిపారు. దేవుని తండా పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్