వారాహి ఆసుపత్రిని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని లేబర్ అడ్డా ప్రాంతంలో వారాహి హాస్పిటల్ ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ చైర్మన్ పుల్కం కుమార్, వైస్ చైర్మన్ నరాల శేఖర్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వాహకులు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ సందీప్ సూర్యవరపు (MD, ఫిజీషియన్) 24 గంటలు అందుబాటులో ఉంటారని, నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ మీడియాకు తెలిపారు. ప్రముఖులను సన్మానించి సత్కరించారు.

సంబంధిత పోస్ట్