వేములవాడలో నిరసన తెలిపిన జర్నలిస్టులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. నటుడు మోహన్ బాబు రిపోర్టర్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. జర్నలిస్టులకు భద్రత కల్పించేందుకు చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్