రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు నుండి సీపీఐ అభ్యర్థిగా కడారి రాములు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఐ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ, ఆశయ సాధన కోసం వార్డు ప్రజల మద్దతుతో ఈసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మహిళలు, 4వ వార్డు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.