కలికోట సూరమ్మ ప్రాజెక్టుకు తొలి ప్రధాన్యత ఇవ్వాలి

వేములవాడ నియోజకవర్గంలోని కథలపూర్ మండలం కలికోట సూరమ్మ చెరువుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వేములవాడ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం రుద్రంగిలో జరిగిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. 43వేల 100 ఎకరాలకు సాగు నీరు అందించే సూరమ్మ ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యతలో పెట్టామన్నారు. ఈ పనులను త్వరలో ప్రారంభం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు.

సంబంధిత పోస్ట్