భయమును వీడండి - ప్రగతిని సాధించండి

పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పట్ల భయాన్ని వీడి, ఒత్తిడి తగ్గించుకొని ప్రగతి సాధించాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఎస్.ఆర్.ఆర్. కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి సూచించారు. రుద్రవరం, అనుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఆయన మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. ఈ కార్యక్రమం రుద్రవరం హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి లత, అనుపురం ప్రధానోపాధ్యాయులు జి. విట్టల్, అనుపురం సర్పంచ్ షేర్ల రాజేశ్వరి మల్లేశం, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన కోఆర్డినేటర్ మానువాడ శంకర్ సమన్వయంతో జరిగింది. విద్యార్థులు సూచనలు పాటిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్ రాజేశ్వరి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్