మల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

నిన్న విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో చందుర్తి మండలంలోని మల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. మొత్తం 47 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలను నమోదు చేశారు. వీరిలో 20 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల కీర్తిని పెంచారు. పులికీర్తన 563 మార్కులతో ప్రథమ స్థానంలో, ఎల్ల చరణ్ 556 మార్కులతో ద్వితీయ స్థానంలో నిలిచారు. గణితంలో 15 మంది, సాంఘిక శాస్త్రంలో 14 మంది, ఆంగ్లంలో 11 మంది విద్యార్థులు 90కి పైగా మార్కులు సాధించారు. ఈ సందర్భంగా 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గ్రామ పాలకవర్గ సభ్యులు సన్మానించి సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్