రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ చెన్నమనేని వికాసరావు, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేష్, దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్ పాల్గొన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు మంజూరు చేశారని, బండి సంజయ్ కుమార్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 20వేల సైకిళ్లను, వేములవాడకు 4000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారని, ప్రభుత్వ ఆసుపత్రికి రెండు కోట్ల విలువైన వైద్య పరికరాలను అందించారని వారు తెలిపారు.