రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని గ్రంథాలయాన్ని బుధవారం ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్బంగా పాఠకులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టడం జరుగుతుందనీ, మంచిగా ఉద్యోగాలకు సన్నద్ధమై ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని సూచించారు. టైం టేబుల్ వారిగా ప్రిపరేషన్ కావాలన్నారు.