ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా నిష్పాక్షికంగా, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎస్ఈసీ హ్యాండ్‌బుక్ వెంట ఉంచుకోవాలని, మార్గదర్శకాల మేరకు ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని తెలిపారు. సిరిసిల్లలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తామని, అధికారులు ఎన్నికల సామగ్రితో కేటాయించిన వాహనాల్లోనే వెళ్లాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను సరిచూసుకోవాలని, ఓటర్లు 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకువెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని, బ్యాలెట్ పేపర్, బాక్స్‌లు చెక్ చేసుకొని వెళ్లాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్