అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్ విజయవంతం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ స్మైల్ విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా, 52 మంది బాలబాలికలను గుర్తించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకున్న వారిపై 4 కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుండి 31 వరకు పోలీస్, చైల్డ్ వెల్ఫేర్, లేబర్, ఎడ్యుకేషన్, చైల్డ్ ప్రొటెక్షన్, రెవెన్యూ, హెల్త్ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విస్తృత తనిఖీలు నిర్వహించి బాలబాలికలను రక్షించారు.

సంబంధిత పోస్ట్