అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న సిరిసిల్లలో తపోవన యోగా కేంద్రం ఆధ్వర్యంలో కోటి సూర్య నమస్కారాలు కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే ప్రయత్నానికి సిరిసిల్ల పురపాలక సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ శనివారం మాట్లాడుతూ సిరిసిల్ల పేరును ప్రపంచ పటంలో నిలిపే ఈ బృహత్తర కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తామని, లక్ష మందితో యోగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించడానికి తామూ భాగస్వాములమవుతామని తెలిపారు. తపోవన యోగా కేంద్రం నిర్వాహకులు కృష్ణ తమ బృందంతో కలిసి చైర్ పర్సన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.