రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లి గ్రామంలో ఈరోజు బడిబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న విద్యా సదుపాయాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్, ఉచిత మధ్యాహ్న భోజనం, రాగిజావా వంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిలుక బాబు, ఉప సర్పంచ్ సుజాత-అనిల్ యాదవ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వైష్ణవి, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.