రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రజలకు జనాభా గణన–2026-27లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఆదివారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 2011 తర్వాత 2026లో జనాభా గణన ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు ప్రజలు ఆన్‌లైన్‌లో తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.