పిల్లల బంగారు భవిత కోసం పోలియో చుక్కలు వేయించాలి: కలెక్టర్

పిల్లల బంగారు భవిత కోసం తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ అర్బన్ పీహెచ్‌సీలో ఆదివారం నిర్వహించిన పోలియో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ప్రభుత్వం ప్రత్యేక శిబిరాల ద్వారా వ్యాక్సిన్ పంపిణీ చేస్తుందని, పోలియో రహిత దేశంగా కొనసాగడానికి 0 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్