ఫస్ట్ హాఫ్ లో ఫెయిల్ అయ్యింది పదేళ్ల బీఆర్ఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇందిరమ్మ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పాటుపడుతోందని, అయితే కేటీఆర్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, ప్రజా ప్రభుత్వంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్